Moviesబాలును బావ అని పిల‌వ‌ని కార‌ణం చెప్పిన శుభ‌లేఖ సుధాక‌ర్‌

బాలును బావ అని పిల‌వ‌ని కార‌ణం చెప్పిన శుభ‌లేఖ సుధాక‌ర్‌

దివంగ‌త లెజెండ్రీ సింగ‌ర్ ఎస్పీ. బాల సుబ్ర‌హ్మ‌ణ్యం 50 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఆయ‌న ఎంతో మంచి మ‌నిషో ఆయ‌న‌తో అనుబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న గురించి జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే బాలు బావ‌మ‌రిది అయిన న‌టుడు శుభ‌లేక సుధాక‌ర్ బాలు గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యాలు వింటే బాలు వ్య‌క్తిత్వం ఎంత గొప్ప‌తో మ‌రోసారి మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

 

త‌న‌కు బాలు గారి సోద‌రి ఎస్పీ శైల‌జ‌తో పెళ్లి కాక ముందు నుంచే బాలు గారితో త‌న‌కు మంచి అనుబంధం ఉండేద‌ని.. తాను ఏ నాడు కూడా బాలు గారిని బావ అని పిల‌వలేద‌ని శుభ‌లేఖ సుధాక‌ర్ చెప్పారు. కెరీర్ ప‌రంగాను, వ్య‌క్తిగ‌త జీవితంలోనూ చిన్న మ‌చ్చ కూడా లేకుండా జీవించిన ఆయ‌న ఎంతో గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి అంటూ సుధాక‌ర్ కొనియాడారు.

 

 

తాను ఎప్పుడూ బాలును బావ‌లా చూడ‌లేదు.. బావ అని పిల‌వ‌లేదు.. గొప్ప లెజెండ్రీ సింగ‌ర్ కావ‌డంతో ఆయ‌న్ను మేరు ప‌ర్వ‌తంలాగానే చూశాన‌ని ఆయ‌న‌తో ఉన్న అనుబంధం సుధాక‌ర్ షేర్ చేసుకున్నారు. బాలును ఎప్పుడూ తాను స‌ర్ అని మ‌ర్యాద‌గానే పిలుస్తాన‌ని.. అలా పిల‌వ‌డ‌మే త‌న‌కు అల‌వాట‌ని చెప్పారు.

 

ఇలా బాలు గురించి ప‌లు విష‌యాలు చెపుతూనే సుధాక‌ర్ ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయ్యారు. బాలు గురించి ఆయ‌న చెప్పిన మొత్తం మాట‌లు వింటే మ‌న మ‌న‌స్సు కూడా ద్ర‌వీభ‌విస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news