Moviesమ‌రో సంచ‌ల‌నానికి రెడీ అయిన గుణ‌శేఖ‌ర్‌... ' శాకుంత‌లం ' మోష‌న్...

మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అయిన గుణ‌శేఖ‌ర్‌… ‘ శాకుంత‌లం ‘ మోష‌న్ పోస్ట‌ర్ చంపేసింది (వీడియో)

క్రియేటివ్ డైరెక్ట‌ర్ రుద్ర‌మ‌దేవి సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ద‌గ్గుబాటి రానాతో హిర‌ణ్య‌క‌శ్య‌ప సినిమా చేయాల‌నుకున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోస‌మే ఏకంగా మూడు సంవ‌త్స‌రాల టైం తీసుకున్నాడు. వెండితెర‌పై హిర‌ణ్య‌క‌శ్య‌ప‌లోని న‌ర‌సింహావ‌తారాన్ని ఆవిష్క‌రించేందుకు చాలా క‌ష్ట‌ప‌డ‌డంతో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోస‌మే ఏకంగా రు. 15 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు టాక్‌..? అయితే ఇంత‌లోనే మ‌రో సంచ‌ల‌నంతో గుణ‌శేఖ‌ర్ షాక్ ఇచ్చాడు.

శుక్ర‌వారం సాయంత్రం 7.11 గంట‌ల‌కు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని ముందుగానే ప్ర‌క‌టించిన గుణ‌శేఖ‌ర్ తాను హిర‌ణ్య‌క‌శ‌ప కంటే ముందే శాకుంత‌లం సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. హిర‌ణ‌శ్య‌క‌శ‌ప కంటే ముందే మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను అని ట్వీట్ చేశాడు గుణ శేఖర్.

ఇక శాకుంత‌లం మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే చాలా ఆహ్లాదంగా క‌నిపిస్తోంది. మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాకు స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. ఏదేమైనా మోష‌న్ పోస్ట‌ర్ తోనే సంచ‌ల‌నం రేపిన గుణ రేపు సినిమాతో ఎలా దుమ్ము రేపుతాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news