Moviesఎన్టీఆర్ 30.. హీటు పెంచేస్తోన్న అప్‌డేట్ వ‌చ్చేసింది..!

ఎన్టీఆర్ 30.. హీటు పెంచేస్తోన్న అప్‌డేట్ వ‌చ్చేసింది..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మైంది. అయితే భారీ వ‌ర్షాలు ఈ సినిమా షూటింగ్‌ను మ‌రో వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసేలా చేశాయి. ఇక ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో క‌లిసి ఓ భారీ సినిమా చేయ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు నిర్మిస్తున్నారు. అస‌లు ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి ఎప్పుడు త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుందా ? అన్న ఆస‌క్తి ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది.

 

 

ఇక ఈ సినిమా గురించి ఓ హీట్ పెంచే అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాలో అధిక భాగం షూటింగ్ యూఎస్ నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. త్రివిక్ర‌మ్ మార్క్ స్టైల్లో ఫ్యామిలీ, ఎమోష‌న్స్‌తో పాటు యాక్ష‌న్ డోస్ కూడా ఎక్కువే ఉంటుందంటున్నారు. ఎన్టీఆర్ సినిమా కావ‌డంతో యాక్ష‌న్ డోస్ ఎక్కువ ఉండేలా త్రివిక్ర‌మ్ స్క్రిఫ్ట్ రెడీ చేసుకున్నాడ‌ట‌. యాక్ష‌న్ పాళ్లు ఎక్కువ ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మామూలు ఖుషీ కాద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news