Moviesప‌వ‌న్ పాలిట ఐరెన్‌లెగ్‌ మహేష్‌కు అయినా క‌లిసి వ‌స్తుందా..!

ప‌వ‌న్ పాలిట ఐరెన్‌లెగ్‌ మహేష్‌కు అయినా క‌లిసి వ‌స్తుందా..!

గీత గోవిందం ద‌ర్శ‌కుడు పెట్ల ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు న‌టిస్తోన్న సినిమా స‌ర్కారు వారి పాట‌. మైత్రీ వాళ్లు, జీఎంబీ బ్యాన‌ర్‌, 14 రీల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ త్వ‌ర‌లోనే అమెరికాలో ప్రారంభం కానుంది. థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాకు మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇక కొద్ది రోజుల క్రితం మ‌హేష్‌బాబు బ‌ర్త్ కానుక‌గా రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది.

 

 

ఇక ఈ సినిమాలో మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు కీర్తి సురేష్‌కు యూనిట్‌లోకి ఆహ్వానం ప‌లుకుతూ టీం మెంబ‌ర్స్ ఆహ్వానం ప‌లికారు. మ‌హేష్ సైతం త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా కీర్తిన త‌మ సినిమాలోకి ఆహ్వానిస్తూ ఈ సినిమా ఆమెకు మెమ‌ర‌బుల్ సినిమాగా మిగిలిపోతుంద‌ని.. అంటూ ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు.

 

అయితే ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న అజ్ఞాత‌వాసి సినిమాలో న‌టించిన కీర్తి సురేష్ పెద్ద ఐరెన్‌లెగ్ అన్న ముద్ర వేయించుకుంది. ఇప్పుడు ఆమె సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప‌క్క‌న న‌టిస్తోంది. మ‌రి ఈ సినిమాతో అయినా మ‌హేష్‌కు హిట్ వ‌స్తుందా ? ప‌వ‌న్‌కు క‌లిసి రాని కీర్తి మ‌హేష్‌కు ఎంత వ‌ర‌కు క‌లిసి వ‌స్తుందో ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news