Moviesమోనాల్ విప్పి చూపిస్తోంది... స్కిన్ షో చేయ‌లేద‌నే ఎలిమినేష‌న్‌... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మోనాల్ విప్పి చూపిస్తోంది… స్కిన్ షో చేయ‌లేద‌నే ఎలిమినేష‌న్‌… సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ల విష‌యంలో ప్రేక్ష‌కుల నుంచి, బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెస్టెంట్ల నుంచి విమ‌ర్శ‌లు తీవ్రం అవుతున్నాయి. తాజాగా ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌రాటే క‌ళ్యాణి బిగ్‌బాస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌రాటే క‌ళ్యాణి అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. షో నుంచి ఎలిమినేట్ అయిన దేవి, సుజాత‌, త‌నకు వ‌చ్చిన ఓటింగ్ విష‌యంలో ఆమె ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసింది. త‌మ‌కు ఎన్ని ఓట్లు వ‌చ్చాయో చెపితే బాగుండేద‌ని ఆమె చెప్పింది.

mona

ఇక దేవికి ఎక్కువ ఓట్లు వ‌చ్చినా ఎలిమినేట్ చేశార‌ని.. మెహ‌బూబ్‌కు బ‌దులుగా త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆమె చెప్పింది. తాజా ఇంట‌ర్వ్యూలో ఎలిమినేట్ అయిన సుజాత‌, క‌ల్యాణి క‌లిసి పాల్గొన్నారు. హౌస్‌లో ఎవ‌రు అయితే స్కిన్ షో చేయ‌ట్లేదో వారు మాత్ర‌మే ఎలిమినేట్ అవుతున్నార‌ని.. స్కిన్ షో చేసే వాళ్లు హౌస్‌లో ఉంటున్నార‌ని బాంబు పేల్చింది. తాను, సుజాత స్కిన్ షో చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఎలిమినేష‌న్ చేశార‌ని ఫైర్ అయ్యింది.

 

మోనాల్ లాంటి వాళ్లు విప్పి చూపిస్తార‌ని… వాళ్లు గ్లామ‌ర్ షో చేస్తార‌ని.. అందుకే వాళ్ల‌ను ఎలిమినేట్ చేయ‌ర‌ని క‌ళ్యాణి పెద్ద బాంబే పేల్చింది. ఇక నిజంగా షోలో కూడా మోనాల్ మామూలు గ్లామ‌ర్ షో చేయ‌ట్లేదు. పైగా ఆమె ముక్కోణ‌పు ప్రేమ క‌థ నేప‌థ్యం కూడా ఆమెకు ప్ల‌స్ అవుతుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news