Moviesఆర్తీ అగ‌ర్వాల్ కెరీర్ నాశ‌నం చేసింది ఆమెనా... త‌రుణ్‌తో బ్రేక‌ప్‌కు కార‌ణ‌మా..!

ఆర్తీ అగ‌ర్వాల్ కెరీర్ నాశ‌నం చేసింది ఆమెనా… త‌రుణ్‌తో బ్రేక‌ప్‌కు కార‌ణ‌మా..!

టాలీవుడ్‌లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన నువ్వునాకు న‌చ్చావ్ ( 2001) సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది ఆర్తీ అగ‌ర్వాల్‌. కె. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా స‌క్సెస్‌లో మేజ‌ర్ క్రెడిట్ ఖ‌చ్చితంగా హీరోయిన్ ఆర్తీ అగ‌ర్వాల్‌దే. ఆ సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా ప‌రిచ‌యం కావ‌డం.. అప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో ఉన్న ఆర్తీని ఓ ఫొటోలో చూసిన నిర్మాత సురేష్‌బాబు పట్టుబ‌ట్టి మ‌రీ ఆమె త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి ఆమెను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేశారు.

 

త‌ర్వాత ఆమె సురేష్ ప్రొడక్ష‌న్‌లోనే త‌రుణ్ హీరోగా వ‌చ్చిన నువ్వులేక నేనులేను సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వా త అదే సురేష్ ప్రొడ‌క్ష‌న్‌లో ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సోగ్గాడు సినిమాలో మ‌రోసారి త‌రుణ్ – ఆర్తీ జంట క‌లిసి న‌టించారు. ఈ రెండు సినిమాల షూటింగ్ టైంలోనే త‌రుణ్  – ఆర్తీ ప్రేమించుకున్నారు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితికి వ‌చ్చేశారు.

 

ఆ త‌ర్వాత ఆర్తీ సోద‌రి అతిధి కూడా గంగోత్రి సినిమాతో ఇక్క‌డ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఇక త‌రుణ్ – ఆర్తీ ప్రేమ పక్షుల్లా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. అయితే త‌రుణ్ త‌ల్లికి ఆమెను కోడ‌లిగా చేసుకోవ‌డం ఇష్టంలేదు. త‌రుణ్ కూడా త‌ల్లి మాట‌కు ఎదురు చెప్ప‌లేకపోయాడు. దీంతో ఈ జంట విడిపోయింది. ఆ త‌ర్వాత ఆర్తీ కెరీర్ నాశ‌నం అయ్యింది. ఆమె మానసిక ఒత్తిళ్ల‌తో చెడు అల‌వాట్ల‌కు లోన‌య్యింది.

 

చివ‌ర‌కు మ‌రీ ఊరు పేరు లేని వాళ్ల ప‌క్క‌న కూడా న‌టించింది. చివ‌ర‌కు ఆమె చేయించుకున్న ఆప‌రేష‌న్ ఫెయిల్ అయ్యి మృతి చెందింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news