Moviesఆ డైలాగ్‌తో చిరును స‌ర్‌ఫ్రైజ్ చేసిన ఈ బుడ్డ‌ది ఎవ‌రో తెలుసా..

ఆ డైలాగ్‌తో చిరును స‌ర్‌ఫ్రైజ్ చేసిన ఈ బుడ్డ‌ది ఎవ‌రో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజులుగా లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికి ప‌రిమితం అయ్యారు. కొరటాల శివ తెర‌కెక్కిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న త‌ల్లి, మ‌న‌వ‌రాళ్లు, కుటుంబంతో ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు, త‌న పాత అనుభూతులు షేర్ చేసుకుంటున్నారు. చిరు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.

 

 

తాజాగా త‌న మ‌న‌వ‌రాలు సంహిత ( చిరు పెద్ద కూతురు సుస్మిత కుమార్తె) రుద్ర‌మ‌దేవి సినిమాలో చెప్పిన డైలాగ్ గాంభీర్యంగా, రాజ‌సంతో చెబుతుంటే ఆ స‌న్నివేశాలు త‌న ఫోన్లో షూట్ చేసి ఆ వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. త‌న మ‌న‌వ‌రాలు చెప్పిన డైలాగ్ విన్న చిరు తెగ మురిసిపోతున్నారు. సంహిత రుద్ర‌మ‌దేవి డైలాగ్ చెప్ప‌డ‌మే కాదు.. యాక్ష‌న్ ప‌రంగా కూడా మెప్పించింది.

 

సంహిత పెర్పామెన్స్‌తో త‌బ్బిఉబ్బ‌యిన చిరు 1990లో సుష్మిత, 2020లో సంహిత పరంపర కొనసాగుతోంది. అచ్చంగా తల్లిలాగే కూతురు అంటూ ఆ వీడియో చిరు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న ఆనందం వ్య‌క్తం చేస్తున్నాడు. అలాగే చిన్నారుల అభిరుచిని బట్టి త‌ల్లిదండ్రులు వారిని ప్రోత్స‌హించాల‌ని కూడా చిరు పేర్కొన్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news