Moviesఈ ఫొటో స్టార్ హీరో ఎవ‌రో తెలుసా... ఈ స్టిల్ స్పెషాలిటీ...

ఈ ఫొటో స్టార్ హీరో ఎవ‌రో తెలుసా… ఈ స్టిల్ స్పెషాలిటీ ఇదే

పై ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా ?  కాస్త ప‌రిశీల‌న‌గా చూస్తే ఈ ఫొటోలో ఉన్న‌ది సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అన్న‌ది తెలిసిపోతుంది. ర‌జ‌నీకాంత్ హీరో అవ్వ‌డానికి ముందు బెంగ‌ళూరులో సిటీ బ‌స్ కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేశారు. 1970వ ద‌శ‌కంలో ఆయ‌న బ‌స్ కండ‌క్ట‌ర్‌. ఆ త‌ర్వాత ఆయ‌న సినిమాల్లోకి రావ‌డం స్టార్ హీరో అవ్వ‌డం జ‌రిగాయి. ఇప్పుడు ర‌జ‌నీ ఏకంగా సౌత్ ఇండియాలోనే సూప‌ర్ స్టార్ అయిపోయారు. ఆయ‌న కండ‌క్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి స్టిల్ ఇది.

 

ర‌జ‌నీ సినిమాల్లోకి రావ‌డానికి ముందు అత‌డి పేరు శివాజీ రావు గైక్వాడ్. ఈ శివాజీ రావు గైక్వాడ్‌గా కండ‌క్ట‌ర్‌గా ప‌ని చేసే స‌మ‌యంలో మ‌ద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ యాక్టింగ్ కోర్సులో చేరి న‌ట‌న‌లో మెళ‌కువ‌ళు నేర్చుకున్నాడు. అప్పుడే ర‌జ‌నీ కె. బాల‌చంద‌ర్ దృష్టిలో ప‌డ‌డంతో ఆయ‌న త‌న సినిమాల్లో ముందు స‌హాయ‌క పాత్ర‌ల్లో అవ‌కాశం ఇచ్చారు. టిక్కెట్లు కొట్ట‌డంలో ర‌జ‌నీ చాలా స్పీడ్‌గా ఉండేవాడ‌ట‌. ర‌జ‌నీ తొలి షిఫ్ట్ ఉద‌యం 6 గంట‌ల‌కు ప్రారంభ‌మై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఉండేద‌ట‌.

 

ఇక ర‌జ‌నీని ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎంట‌ర్టైన్ చేయాలో బాగా తెలుసు అని అత‌డితో పాటు క‌లిసి ప‌నిచేసిన బ‌స్సు డ్రైవ‌ర్ చెప్పాడు. ఇక ఈ సంక్రాంతికి ద‌ర్బార్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌జ‌నీ ప్ర‌స్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించిన అన్నాథేలో న‌టిస్తున్నాడు. ద‌రువు శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఖుష్బు- నయనతార- మీనా- కీర్తి సురేష్- ప్రకాష్ రాజ్- సూరి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news