Moviesఅమ్మ రాజ‌శేఖ‌ర్ రు. 6 కోట్ల‌కు ఇల్లు అమ్మేశాడా... ఛాన్సులు కూడా...

అమ్మ రాజ‌శేఖ‌ర్ రు. 6 కోట్ల‌కు ఇల్లు అమ్మేశాడా… ఛాన్సులు కూడా లేవా…!

బిగ్‌బాస్ హౌస్‌లో జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ శుక్ర‌వారం ఎపిసోడ్లో లాక్‌డౌన్ వ‌ల్ల ఆర్థిక ఇబ్బందుల నేప‌థ్యంలో తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నానంటూ చెప్ప‌డంపై అమ్మ రాజ‌శేఖ‌ర్ ఫైర్ అయ్యాడు. అలా ఆలోచిస్తే ఆర్టిస్ట్ అనేవాడు ప్ర‌తి రోజు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిందే అన్నాడు. ఇక ఈ అంశంపై వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడిన నాగార్జున నోయ‌ల్ నామినేష‌న్ చేసినప్పుడు ఆయ‌న వివ‌ర‌ణ వినేందుకు రాజ‌శేఖ‌ర్ ఒప్పుకోక‌పోవ‌డం క‌రెక్ట్ కాద‌న్న నాగ్ అవినాష్ విష‌యంలో మీరు మాట్లాడిన తీరు న‌చ్చింద‌ని ప్ర‌శ్నించాడు.

Amma Rajasekhar Bigg Boss Telugu 4 Contestant | Wiki, Family, Wife, Age,  Biography, Career, Personal Life | Oracle Globe

ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఏంట్రా మ‌రోసారి ఆ మాట అంటే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన తీరు బాగుంద‌ని నాగార్జున అన్నాడు. ఆ స‌మ‌యంలోనే మీరు రు. 6 కోట్ల‌కు ఇళ్లు అమ్మేశాన‌ని చెప్పారు. ఎందుక‌ని నాగ్ రాజ‌శేఖ‌ర్‌ను ప్ర‌శ్నించాడు. అందుకు రాజ‌శేఖ‌ర్ స్పందిస్తూ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని… ఆ ఇంట్లో ఆమె కింద జారి ప‌డిపోయార‌ని అప్పుడు సంవ‌త్స‌రం పాటు ఆసుప‌త్రిలోనే ఉన్నామ‌ని రాజేశేఖ‌ర్ చెప్పాడు.

Amma Rajasekhar Birthday Celebrations | Photos Gallery

ఆ ఇళ్లు క‌లిసి రాద‌ని కొంద‌రు చెప్ప‌డంతోనే తాను ఎంతో ఇష్ట‌ప‌డి కట్టుకున్న ఇంటిని రు. 6 కోట్ల‌కు అమ్మేశాన‌ని.. ఇప్పుడు దానిని చూడ‌డం త‌ప్పా ఏం చేయ‌లేమ‌ని రాజ‌శేఖ‌ర్ చెప్పాడు. అప్పుడు సంవ‌త్స‌రం పాటు అమ్మతో ఉండటం వల్ల నాకు సినిమాల్లో ఆఫర్లు తగ్గాయని రాజశేఖర్ మాస్టర్ అన్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వ‌గా సుజాత బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news