Moviesఆహా వారి ' అద్దం ' ట్రైల‌ర్‌.. మామూలు ఎఫైర్లు కాదుగా.....

ఆహా వారి ‘ అద్దం ‘ ట్రైల‌ర్‌.. మామూలు ఎఫైర్లు కాదుగా.. (వీడియో)

మూడు జంట‌లు… ఎమోష‌న్లు… ఎఫైర్ల‌తో ఆహా ఓటీటీ నిర్మాణంలో తెర‌కెక్కిన సినిమా అద్దం. ఈ వెబ్‌సీరిస్ ట్రైల‌ర్‌తోనే హీటెక్కించేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆహాలో ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయినా దేనికి కూడా క్రిటిక్స్‌, విశ్లేష‌కులు, సినీ అభిమానుల నుంచి స‌రైన రెస్పాన్స్ రాలేదు. అయితే అద్దం ట్రైల‌ర్‌కు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. అల్లు అర‌వింద్ టీం ఎంతో కంటెంట్‌ను ప్రేక్ష‌కుల మీద‌కు వ‌దులుతున్నా రాని రెస్సాన్స్ వాళ్ల తాజా వెబ్‌సీరిస్ అద్దం ట్రైల‌ర్‌కు వ‌చ్చింది.

 

ట్రైల‌ర్లోనే ఇది మూడు జంట‌ల క‌థ అని చెప్పేశారు. ఈ క‌థ‌లో ఎఫైర్ల వ్య‌వ‌హారం చూపించార‌ని తెలుస్తోంది. ఆ మూడు జంటల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ? అన్నది సస్పెన్స్ ఎలిమెంట్. ట్రైల‌ర్ చూస్తుంటే అటు ఎఫైర్ల‌తో పాటు భావోద్వేగాలు, భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధం ఇలా అన్ని అంశాల మేళ‌వింపుతో ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

ప్ర‌స‌న్న‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, కిషోర్‌, రోహిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఇందులో మూడు క‌థ‌ల‌కు ముగ్గురు వేర్వేరు ద‌ర్శ‌కులు ప‌నిచేశారు. తెలుగు, త‌మిళ న‌టులు ఈ సీరిస్‌లో న‌టించారు. అక్టోబ‌ర్ 16 నుంచి ఇది ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఏదేమైనా ట్రైల‌ర్లోనే నువ్వు దాంతో ప‌డుకున్నా నాకేం ప‌ర్లేదు లాంటి ఘాటు డైలాగుల‌తో హీటెక్కించిన అద్దం ఎంత ఘాటుగా, హాటుగా ఉంటుందో ?  చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news