Moviesబిగ్‌బాస్ హౌస్‌లోకి అడ‌ల్డ్ స్టార్ ఎంట్రీ.. చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంతే..!

బిగ్‌బాస్ హౌస్‌లోకి అడ‌ల్డ్ స్టార్ ఎంట్రీ.. చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంతే..!

ఓ వైపు క‌రోనా దెబ్బ‌తో వినోద రంగం కుదులైనా కూడా బిగ్‌బాస్ షోకు మాత్రం వ‌చ్చిన ఇబ్బంది లేదు. కోవిడ్ జాగ్ర‌త్త‌లు  తీసుకుంటూనే బిగ్‌బాస్‌ను న‌డిపించేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో బిగ్‌బాస్ షో ప్రారంభం కావ‌డంతో పాటు నెల రోజులు కంప్లీట్ చేసుకుంది. న‌లుగురు కంటెస్టెంట్లు సైతం బ‌య‌ట‌కు వెళ్లారు. ఇక త‌మిళ్‌, హిందీ బిగ్‌బాస్ షో ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఇక హిందీ బిగ్బాస్‌కు ఎప్ప‌టిలాగానే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా ఉండ‌నున్నాడు.

 

క‌రోనా లాక్‌డౌన్ వేళ ప్రేక్ష‌కులు వినోదానికి మొఖం వాచి ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌ను స‌ల్మాన్ మ‌రింత వినోదంతో న‌డిపిస్తాడ‌ని అంద‌రూ ఆశిస్తున్నారు. ఈ సారి హిందీ బిగ్‌భాస్ కంటెస్టెంట్ల‌లో ఫీమేల్స్‌లో మంచి హాట్ హాట్ కంటెస్టెంట్లు ఉన్నట్టు టాక్‌.. ? ఈ క్ర‌మంలోనే తొలి వారం త‌ర్వాత హౌస్‌లోకి ఓ అడ‌ల్ట్‌స్టార్‌ను పంపేందుక ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ బోల్డ్ స్టార్ ఎవ‌రో కాదు స‌ప్న స‌ప్పు.

 

 

స‌ప్న దాదాపుగా 20 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతోంది. ఆమె బోల్డ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల‌తో పాటు ప‌లు వెబ్ సీరిస్‌ల‌లో బోల్డ్‌గా న‌టించింది. ఆమె ఉత్త‌రాదిలో ఎంతోమంది కుర్ర‌కారు క‌ల‌ల బోల్డ్ రాణి అన్న ముద్ర వేయించుకుంది. సప్న భాబీ వెబ్ సిరీస్‌లో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుండ‌డంతో ఆమెకు చివ‌ర‌కు స‌ప్న బాబీ పేరే స్థిర‌ప‌డిపోయింది.

 

బోల్డ్‌గా క‌నిపించే విష‌యంలో స‌ప్న బాబీ ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌దు. ఇప్పుడు ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి ఇస్తే హౌస్‌కు కావాల్సినంత గ్లామ‌ర్‌తో పాటు అందాల ర‌చ్చ మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news