Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ - రానా మల్టీస్టార్‌‌... ప్లాప్ డైరెక్ట‌ర్ ఫిక్స‌య్యాడే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా మల్టీస్టార్‌‌… ప్లాప్ డైరెక్ట‌ర్ ఫిక్స‌య్యాడే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌లో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. వ‌కీల్‌సాబ్ కంప్లీట్ అయిన వెంట‌నే కాస్త గ్యాప్ తీసుకుని క్రిష్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కే పాన్ ఇండియా సినిమా చేస్తాడు. ఈ సినిమా కూడా ఇప్ప‌టికే తొలి పార్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

 

ఆ వెంట‌నే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా, ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి సినిమాలు వ‌రుస‌గా లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే క్రిష్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కే సినిమా చారిత్రాత్మ‌క సినిమా కావ‌డంతో ఫారిన్ షెడ్యూల్స్‌తో పాటు ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి ఉంది. అయితే ఈ కాస్త గ్యాప్‌లో విదేశీ లొకేష‌న్స్ అవ‌స‌రం లేకుండానే ఓ సినిమా కంప్లీట్ చేయాల‌న్న ప్లాన్‌లో ప‌వ‌న్ ఉన్నాడు.

 

ఆ సినిమా మ‌ల్టీస్టార‌ర్ కావ‌డం మ‌రో విశేషం. మ‌ళ‌యాళ సినిమా అయ్య‌ప్ప‌న్ కోషియ‌మ్‌. చాలా రోజుల నుంచి ప‌వ‌న్ ఈ సినిమా చేస్తార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ప‌వ‌న్ ఈ సినిమా రీమేక్‌లో న‌టిస్తార‌ని.. ఈ సినిమాలో ద‌గ్గుబాటి రానా కూడా మ‌రో కీల‌క పాత్ర చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ – రానా కాంబో అంటే పెద్ద ద‌ర్శ‌కుడే ఉండాలి. ప్ర‌స్తుతం పెద్ద ద‌ర్శ‌కులు అంద‌రూ బిజి బిజీగా ఉన్నారు.

 

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఇక డైరెక్ట‌ర్‌గా ప‌లువురు పేర్లు ప‌రిశీలిస్తున్నా గోపాల గోపాలా, కాట‌మ‌రాయుడు ఫేం డాలి అయితే త్వ‌ర‌గా ఫినిష్ చేస్తాడ‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి ఈ ప్లాపు డైరెక్ట‌ర్‌తో క్రేజీ కాంబినేష‌న్ ఎంత వ‌ర‌కు సెట్ అవుతుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news