Moviesఆ బిగ్‌బాస్ న‌టికి తీవ్ర అనారోగ్యం... ప‌రిస్థితి డేంజ‌రే..!

ఆ బిగ్‌బాస్ న‌టికి తీవ్ర అనారోగ్యం… ప‌రిస్థితి డేంజ‌రే..!

ప్ర‌ముఖ రియాల్టీ టీవీ స్టార్‌, హిందీ బిగ్‌బాస్ 13వ సీజ‌న్ కంటెస్టెంట్ హిమాన్షీ ఖురానా గైనిక్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో ఆమె త్వ‌ర‌లోనే ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు రెడీ అవుతోంద‌ట‌. హిమాన్షీ పీసీఓఎస్‌(పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోమ్‌) సమస్య తీవ్రమైన నేపథ్యంలో ఆమెకు స‌ర్జ‌రీ త‌ప్ప‌దంటున్నారు. ఇక ఆమె కొద్ది రోజుల క్రిత‌మే వీల్ చైర్‌లో కూర్చొన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అప్పుడే ఆమెకు ఏమైందా ? అని ఆరా తీయ‌డం ప్రారంభించారు.

నెలసరిలో అధిక రక్తస్రావం మూలాన ఆమె ఆరోగ్యం క్షీణించిందట‌. ఆమె న‌డిచే ప‌రిస్థితుల్లో లేక‌పోవ‌డంతో ఆమె పాల్గొనాల్సిన షూటింగ్‌లు కూడా ర‌ద్దు చేసే అవ‌కాశం ఉందంటున్నారు.  ఇక తాను పీసీఓఎస్‌ కారణంగా బరువు అధికంగా పెర‌గ‌డంతో త‌న ఫొటో సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ప్ర‌తిసారి తాను ట్రోలింగ్‌కు గుర‌య్యాన‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక పీసీఓస్‌ కారణంగా నాకు తరచుగా బీపీ డౌన్‌ అవుతుంది. అందుకే ప్రతీ మూడు గంటలకొకసారైనా ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఉపయోగిస్తాన‌ని హిమాన్షు చెప్పింది. అయితే అంద‌రి స్త్రీల‌లో ఈ త‌ర‌హా స‌మ‌స్య‌లు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కూడా ఆమె తెలిపింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన ఆహారం తీసుకుంటే దీనిని అధిగమించవచ్చ‌ని ఆమె తెలిపారు. ఈ విష‌యం తెలియ‌డంతో ఆమె అభిమానులు ఆమె త్వ‌ర‌గా కోలుకుని తిరిగి షూటింగుల్లో పాల్గోవాల‌ని కోరుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news