Moviesచిక్కుల్లో సుశాంత్ రాజ్‌పుత్ బ‌యోపిక్‌...!

చిక్కుల్లో సుశాంత్ రాజ్‌పుత్ బ‌యోపిక్‌…!

బాలీవుడ్ వ‌ర్థ‌మాన హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత  ఈ కేసును సీబీఐ సీరియ‌స్‌గా విచారిస్తోంది. రియాను ఇప్ప‌టికే మూడు రోజులుగా విచారిస్తోన్న సీబీఐ మ‌రో నాలుగు రోజుల పాటు వ‌రుస‌గా విచారించ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ విచార‌ణ‌లో పలు కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే అప్పుడే సుశాంత్ బ‌యోపిక్ కూడా ప్రారంభ‌మైంది. ఈ బ‌యోపిక్ ప్రారంభ‌మైందో లేదో అప్పుడే వివాదాలు చుట్టుముట్టాయి.

సీనియ‌ర్ న‌టుడు రాజ్‌బ‌బ్బ‌ర్ కుమారుడు ఆర్యా బ‌బ్బ‌ర్ హీరోగా ప్రారంభ‌మైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ పోస్ట‌ర్లో హీరో ఆర్య బబ్బ‌ర్ ఉరి తాడు మ‌ధ్య‌లో ఉంటాడు. దీనిపై విమ‌ర్శ‌లు త‌లెత్తాయి. సుశాంత్ అభిమానులు ఈ సినిమాను బ‌హిష్క‌రించాల‌ని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీనికి సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ మద్దతు పలికారు. దీంతో సినిమా ప‌ట్టాలెక్క‌కుండానే అప్పుడే చిక్కుల్లో ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news