Moviesమ‌న్మ‌థుడు నిజంగానే గ్రేట్‌.. ఏ తెలుగు హీరోకు కూడా బిగ్‌బాస్‌ను హోస్ట్...

మ‌న్మ‌థుడు నిజంగానే గ్రేట్‌.. ఏ తెలుగు హీరోకు కూడా బిగ్‌బాస్‌ను హోస్ట్ ద‌మ్ములేదా..!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో 4 సెప్టెంబ‌ర్  6వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచి ప్రారంభం కానుంది. క‌రోనా నేప‌థ్యంలో ఈ సారి షో ఉంటుందా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగ క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భాష‌లో కూడా బిగ్‌బాస్ 4 సీజ‌న్ ప్రారంభం కాలేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మిళ్ స్టార్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ సైతం బిగ్ బాస్‌ను హ‌స్ట్ చేసేందుకు నో చెపుతూ వ‌చ్చాడు.

తమిళ్ బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు షో ఎక్క‌డా ప్రారంభం కాలేదు. అయితే తెలుగు బిగ్‌బాస్ 4 సీజ‌న్‌కు సంబంధించి నాగార్జున నిజంగానే కింగ్ అని చెప్పుకోవాలి. మ‌హామ‌హులే ఈ షోను న‌డిపేందుకు, హోస్ట్ చేసేందుకు వెన‌క‌డుగు వేస్తున్నారు. క‌రోనా వేళ ఎవ్వ‌రూ రిస్క్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. నాగార్జున మాత్రం డేరింగ్‌గా స్టెప్ వేసి షో కోసం రెడీ అవుతున్నాడు.

ఈ యేడాదిలో టెలీకాస్ట్ అవుతోన్న తొలి బిగ్‌బాస్ షో నాగార్జున‌దే కావ‌డం విశేషం. ఇప్పుడ‌న్న ప‌రిస్థితుల్లో ఏ తెలుగు హీరో కూడా షోను హోస్ట్ చేసేందుకు ముందుకు రాలేదని.. అందుకే మూడో సీజ‌న్ హోస్ట్ చేసిన నాగార్జున‌నే మ‌ళ్లీ కంటిన్యూ అవుతున్నార‌ని కూడా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news