Moviesసుశాంత్ మ్యాట‌ర్‌లో మ‌రో ట్విస్ట్‌... ఆ స్టార్ హీరోయిన్ చిచ్చుతోనే సారాతో...

సుశాంత్ మ్యాట‌ర్‌లో మ‌రో ట్విస్ట్‌… ఆ స్టార్ హీరోయిన్ చిచ్చుతోనే సారాతో బ్రేక‌ప్

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతి తర్వాత అతని వ్యక్తిగత జీవితం, ఇత‌ర రిలేష‌న్ షిప్‌ల‌పై అనేక విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కేదార్‌నాథ్ సినిమాలో సుశాంత్ ప‌క్క‌న న‌టించిన సారా ఆలీఖాన్‌తో కొద్ది రోజులు డేటింగ్‌లో ఉన్నాడ‌ని.. వీరిద్ద‌రు క‌లిసి బ్యాంకాంగ్ ట్రిప్‌కు కూడా వెళ్లార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఏమైందో గాని స‌డెన్‌గా సారా అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసింది.

 

 

దీని వెన‌క కూడా మూవీ యాఫియా ఉంద‌ని కంగ‌న ఫైర్ అయ్యింది. ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ సారాతో డేటింగ్‌లో ఉన్న‌ప్పుడు ఈ మాఫియా ఎంట‌ర్ అయ్యి వారు కావాల‌నే విడిపోయేలా చేసింద‌ని ఫైర్ అయ్యింది. సారా పిన్న అయిన స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ సైతం సారాతో మీరు మీ తొలి హీరోతో డేటింగ్ చేయ‌వ‌ద్ద‌ని చెప్పిన మాట‌లు రికార్డ్‌డె్‌గా ఉన్నాయ‌ని కంగ‌న బాంబు పేల్చింది.

 

 

మూవీ మాఫియా మిమ్మ‌ల‌ను బ‌హిరంగంగా హ‌త్య చేసింది.. ఇప్పుడు ఇదే గ్యాంగ్ వ‌చ్చి న‌న్ను ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని కంగ‌న చెప్పింది. ఇక సారాతో బ్రేక‌ప్ త‌ర్వాతే సుశాంత్ రియాకు ద‌గ్గ‌ర‌య్యాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news