Moviesఆ హీరోతో ప‌డుకున్నా ఆ పాత్రే ఇచ్చారు.. కంగ‌నా బాంబు

ఆ హీరోతో ప‌డుకున్నా ఆ పాత్రే ఇచ్చారు.. కంగ‌నా బాంబు

బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా రనౌత్ బాలీవుడ్‌పై వ‌రుస‌గా నిప్పులు క‌క్కుతున్నారు. ఇక తాజాగా బీటౌన్‌లో నెపోటిజంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోన్న కంగ‌నా ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ వ్యాఖ్య‌ల‌కు కూడా ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. తాను ఎంచుకున్న సినిమాల వ‌ల్లే త‌న‌కు ఈ గుర్తింపు వ‌చ్చింద‌ని.. జ‌యాజీ ఇండ‌స్ట్రీకి స్త్రీ వాదం నేర్పించింది తానేన‌ని.. తాను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో కొంద‌రు స్టార్ హీరోల‌తో గ‌డిపినా కూడా త‌న‌కు చిన్న పాత్ర‌ల్లో మాత్ర‌మే అవ‌కాశాలు ఇచ్చార‌ని కంగ‌నా వాపోయింది.

కేవ‌లం రెండు నిమిషాల నిడివి ఉన్న రొమాంటిక్ పాత్ర‌ల్లో మాత్ర‌మే తాను చూపించేవార‌ని.. హీరోయిన్‌గా తాను ఈ స్తాయిలో ఉన్నానంటే కార‌ణం మీరు కాదు… తాను ఎంచుకున్న మంచి క‌థా బ‌లం ఉన్న సినిమాల వ‌ల్లే అని కంగ‌న చెప్పింది.  ఇక బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత ఆమె బాలీవుడ్ మాఫియాపై తీవ్రమైన విమ‌ర్శ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక బాలీవుడ్ స్టార్స్ అయిన రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, అయాన్‌ ముఖర్జీ రక్తపరీక్షలు చేయించుకుని తాము క్లీన్‌ అని నిరూపించుకోవాలని కూడా కంగ‌నా స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news