Moviesఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్ల మాట‌ల యుద్దం.. తూటాల్లా పేలాయ్‌..!

ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్ల మాట‌ల యుద్దం.. తూటాల్లా పేలాయ్‌..!

ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. వారి మ‌ధ్య మాట‌లు తూటాల్లా పేలాయి. బీజేపీ ఎంపీ ర‌వికిష‌న్ ఇటీవల మాట్లాడుతూ ఇండ‌స్ట్రీలో కొంద‌రు మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లు అవుతున్నార‌ని.. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు జ‌యాబ‌చ్చ‌న్ ఒక‌రిద్ద‌రు చేసిన త‌ప్పుల‌కు మొత్తం సినీ ప‌రిశ్ర‌మ‌ను నిందించ‌డం త‌గ‌ద‌న్నారు. ఓ న‌టుడు అయిన ఎంపీ ఇలా మాట్లాడ‌డం బాధాక‌ర‌మ‌ని జ‌య ఖండించారు.

ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో సినిమా ప‌రిశ్ర‌మ కూడా రెండుగా చీలిపోయింది. కొంద‌రు జ‌య‌కు స‌పోర్ట్ చేస్తుంటే.. మ‌రి కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై మ‌రో సీనియ‌ర్ హీరోయిన్, బీజేపీ నేత జ‌య‌ప్ర‌ద స్పందించారు. రవికిషన్ వ్యాఖ్యలను అడ్డంపెట్టుకుని జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

మ‌త్తు ప‌దార్థాలు, మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస అయిన వారిని కాపాడేందుకు ర‌వికిష‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఆయ‌న‌కు తాను మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని చెప్పారు. ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజ‌కీయాలు చేయాల‌నుకోవ‌డం జ‌యాకు త‌గ‌ద‌న్నారు. డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగానే మ‌న‌మంతా పోరాడాల‌ని జ‌య‌ప్ర‌ద పిలుపు ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news