Politicsబీజేపీదే అధికారం అంటోన్న బాల‌య్య హీరోయిన్‌... ఎమ్మెల్యేగా పోటీ...!

బీజేపీదే అధికారం అంటోన్న బాల‌య్య హీరోయిన్‌… ఎమ్మెల్యేగా పోటీ…!

సౌత్ ఇండియాలో సూప‌ర్ పాపుల‌ర్ హాట్ హీరోయిన్‌గా న‌మిత ఓ వెలుగు వెలిగింది. తెలుగులో అనేక సినిమాల్లో న‌టించిన న‌మిత బాల‌య్య ప‌క్క‌న సింహా సినిమాలో సింహా సింహా అంటూ ఓ ఊపు ఊపేసింది. ఈ క్ర‌మంలోనే వీరేంద్ర చౌద‌రిని ప్రేమించి పెళ్లి చేసుకున్న న‌మిత త‌మిళ రాజ‌కీయాల్లో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే జ‌య‌ల‌లిత మ‌ర‌ణానికి ముందు అన్నాడీఎంకేలో చేరిన న‌మిత గ‌త యేడాది చివ‌ర్లో బీజేపీ నిర్వాహ‌క అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంది.

ఇక తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న న‌మిత మాట్లాడుతూ తమిళనాడులో త్వరలో బీజేపీ అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక్క‌డ పార్టీ తిరుగులేని శ‌క్తిగా మారుతుంద‌ని కూడా ఆమె చెప్పారు. ఇక నీట్ పరీక్షకు భయపడి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడరాదని, అలాంటి వారు ఒక్కసారి తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.

ఇక మాన‌సిక ఒత్తిళ్ల‌ను త‌ట్టుకునేందుకు విద్యార్థులు ధ్యానం చేయాల‌ని కూడా న‌మిత సూచించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు నమిత బదులిస్తూ, ఆ విషయం ప్రస్తుతం అవసరం లేదని ఆమె బదులిచ్చారు. అయితే ఆమె త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news