Gossipsయంగ్ హీరోకు అక్క రోల్లో అనుష్క‌...

యంగ్ హీరోకు అక్క రోల్లో అనుష్క‌…

టాలీవుడ్‌లో స్వీటీ బ్యూటీ అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 16 ఏళ్లు అవుతోంది. ఇటీవ‌ల కాలంలో ఇంత సుదీర్ఘంగా కెరీర్‌ను కొన‌సాగించిన హీరోయిన్ అనుష్కే అని చెప్పాలి. ఇంత కాలం కెరీర్ కొన‌సాగించ‌డం ఒక ఎత్తు అయితే అరుంధ‌తి, పంచాక్ష‌రి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి లాంటి చారిత్ర‌క పాత్ర‌ల్లో కూడా న‌టించి మెప్పించిన ఘ‌న‌త ఆమెకు మాత్ర‌మే ద‌క్కుతుంది. ఇప్ప‌టికే న‌ల‌భై ఏళ్ల వ‌య‌స్సులో ఉండ‌డంతో ఈ ముదురు ముద్దుగుమ్మ‌కు సినిమా ఛాన్సులు ఇచ్చే విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెన‌క‌డుగు వేస్తున్నారు.

అనుష్క వ‌య‌స్సు పెర‌గ‌డంతో పాటు శ‌రీర ఆకృతిలో మార్పు రావ‌డం కూడా ఇందుకు ఓ కార‌ణం. ఇదిలా ఉంటే ఆమె ప్ర‌స్తుతం ఓ టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో న‌టిస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ యంగ్ హీరో ప‌క్క‌న హీరోయిన్‌గా కాదు.. ఆమె ఆ హీరోకు అక్క‌గా న‌టించ‌బోతోంద‌ట‌. ఓ హిట్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించే ఈ సినిమాలో ఆమె ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లోనే అక్క‌గా క‌నిపించ‌బోతోంద‌ట‌. అనుష్క‌కు క‌థ న‌చ్చ‌డంతోనే ఆమె ఆ పాత్ర‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతోందంటున్నారు.

దీనికి సంబంధించి ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక అనుష్క ప్ర‌స్తుతం న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా ఓటీటీలో రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆమె తెలుగుతో పాటు త‌మిళ్‌లో కూడా మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఏదేమైనా అనుష్క‌కు హీరోయిన్ పాత్ర‌లు రావ‌డం అయితే క‌ష్ట‌మే అన్న‌ది డిసైడ్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news