Moviesరియా ఇంటిపై ఉద‌యాన్నే మెరుపు దాడులు... ప‌క్కా ఎవిడెన్సుల‌తో బుక్‌..!

రియా ఇంటిపై ఉద‌యాన్నే మెరుపు దాడులు… ప‌క్కా ఎవిడెన్సుల‌తో బుక్‌..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఆ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి ఇంటిపై నార్కోటిక్ అధికారులు  ఈ రోజు ఉద‌యం మెరుపు దాడులు చేశారు. రియా ఇంటితో పాటు ఆమె స్నేహితుల ఇళ్ల‌పై ఎలాంటి స‌మాచారం లేకుండానే అధికారులు ఉద‌యాన్నే మెరుపు దాడులు చేసి కీల‌క స‌మాచారం రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఇక రియా ఇంట్లో డ్ర‌గ్స్‌కు సంబంధించిన వివ‌రాలు ఉన్న‌ట్టు తెలియ‌డంతోనే ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా సోదాలు చేశార‌ని అంటున్నారు. ఇటీవ‌ల డ్ర‌గ్స్ డీల‌ర్లు, ట్రాఫిక‌ర్ల‌ను కూడా అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన స‌మాచారం మేర‌కే రియాపై నార్కోటెక్ అధికారుల అనుమానాలు మ‌రింత పెరిగాయి. కైజన్ ఇబ్రహీంను అరెస్ట్ చేయడానికి ముందు బాసిత్ పరిహార్ నుండి కీలక సమాచారంను అధికారులు సేకరించారు.

ఇక బాలీవుడ్‌లో 90 శాతం మంది వీరి నుంచే డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని కూడా తెలుస్తోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు సుశాంత్ మృతి చుట్టూ తిరిగిన కేసు కాస్తా ఇప్పుడు బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వైపు మ‌ళ్లింది. ఇక తాజాగా రియా ఇంట్లో జ‌రిగిన సోదాల్లో డ్ర‌గ్స్ వాడినట్టు కొన్ని ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. దీనిపై మ‌రిన్ని ఆధారాల‌తో ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news