Moviesబ‌న్నీ ఖాతాలో తిరుగులేని ఇండియా రికార్డు

బ‌న్నీ ఖాతాలో తిరుగులేని ఇండియా రికార్డు

టాలీవుడ్ స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ హిట్ మూవీ అల వైకుంఠ‌పురంలో సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల సినిమా ఎన్ని రికార్డులు తిర‌గ‌రాసిందో ఏ రేంజ్ బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమ ఖాతాలో మ‌రో  ఫస్ట్ ఎవర్ సౌత్ ఇండియన్ రికార్డు పడింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాస్ సాంగ్ రాములో రాముల ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ సాంగ్ లిరిక‌ల్ వీడియో 200 మిలియన్ వ్యూస్ తో అప్పుడు రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ సైతం ఏకంగా 200 మిలియ‌న్ల వ్యూస్‌తో మ‌రో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సాంగ్‌కు 1 మిలియ‌న్ లైక్స్ కూడా రాబ‌ట్టింది. ఇలా ఒక లిరిక‌ల్ సాంగ్‌తో పాటు అదే సాంగ్ వీడియో కూడా 200 మిలియ‌న్ల ఫీట్ సాధించ‌డం అరుదు. ఇపుడు అదే రికార్డు బన్నీ ఖాతాలో పడింది. ఇక బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంట‌నే కొర‌టాల శివ డైరెక్ట్ చేసే సినిమాలో న‌టిస్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news