Moviesరామ్‌చ‌ర‌ణ్ ' మెరుపు ' అందుకే ఆగిందా.. ఎన్ని కోట్లు న‌ష్ట‌మో...

రామ్‌చ‌ర‌ణ్ ‘ మెరుపు ‘ అందుకే ఆగిందా.. ఎన్ని కోట్లు న‌ష్ట‌మో తెలుసా…!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ – కాజ‌ల్ జంట‌గా వ‌చ్చిన మ‌గ‌ధీర సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా వ‌చ్చాక మ‌ళ్లీ చ‌ర‌ణ్ – కాజ‌ల్ కాంబోలో మెరుపు సినిమా ప్రారంభ‌మైంది. త‌మిళ ద‌ర్శ‌కుడు ధూల్ ధ‌ర‌ణి ద‌ర్శ‌కుడిగా ఈ సినిమా ప‌ట్టాలెక్కింది. అప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ ఆరెంజ్ సినిమా ప్లాప్‌తో ఉన్నాడు. ఇక ధ‌ర‌ణి చెప్పిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ క‌థ‌తో మెర‌పు తెర‌కెక్కించేలా ప్లాన్ చేశారు. రెండు, మూడు షెడ్యూల్స్ కూడా అయ్యాయి. అప్ప‌టికే నిర్మాత ఆర్‌బి. చౌద‌రి రు. 10 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు.

Thaman: Ram Charan, Kajal head to southern Tamil Nadu | Telugu Movie News -  Times of India

ఆ త‌ర్వాత ఈ సినిమా హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతోనే అక్క‌డితోనే ఆపేశార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ప‌వ‌న్‌తో బంగారం సినిమా తీస‌న ధ‌ర‌ణ ముందు చెప్పిన క‌థ‌కు ఆ త‌ర్వాత తెర‌కెక్కించిన తీరుకు ఈ సినిమా హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఎవ్వ‌రికి లేక‌పోవ‌డం… అప్ప‌టికే ఆరెంజ్ ప్లాప్‌తో ఉన్న చ‌ర‌ణ్‌. మరో ప్లాప్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేక‌పోవ‌డంతో మెరుపును మ‌ధ్య‌లోనే ఆపేశారు.

Ramleela Photos: HD Images, Pictures, Stills, First Look Posters of  Ramleela Movie - FilmiBeat

దేవిశ్రీ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కొన్ని పాటలు కూడా కంపోజ్ చేశారు. ఆ త‌ర్వాత అక్క‌డితో సినిమా ఆగిపోయింది. అయితే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌న్న ఉద్దేశంతో ఇదే కాంబినేష‌న్లో ఆర్‌బి. చౌద‌రి నిర్మాత‌గా రచ్చ సినిమా చేశారు. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాస్ హిట్‌గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news