Gossipsడ్ర‌గ్స్ ఉచ్చుల్లో చిక్కుకున్న ప్ర‌భాస్ హీరోయిన్ ..!

డ్ర‌గ్స్ ఉచ్చుల్లో చిక్కుకున్న ప్ర‌భాస్ హీరోయిన్ ..!

ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ ఉదంతం క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇప్ప‌టికే  ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న అందాల హీరోయిన్ రాగిణి ద్వివేది ( జెండా పై క‌పిరాజు ఫేం)తో పాటు, ఆమె స‌న్నిహితుడు ర‌విశంక‌ర్‌కు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాగిణి విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అయితే ఆమె స్నేహితుడు ర‌విశంక‌ర్‌ను మాత్రం పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆ త‌ర్వాత రాగిణిని కూడా అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు.

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ మాఫియాకు బాలీవుడ్‌తో సంబంధాలున్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ సంబరగి ఆరోపించడంతో ముడి మరింత బిగుసుకుంది. బాలీవుడ్‌తో సంబంధాలున్న ఇంతియాజ్‌ ఖాత్రిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మ‌రో హాట్ హీరోయిన్ సంజ‌న పేరు కూడా వినిపిస్తోంది. సంజ‌న తెలుగులో ప‌లు సినిమాల్లో న‌టించింది. ప్ర‌భాస్ ప‌క్క‌న ఆమె బుజ్జిగాడులో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

సంజ‌న బెస్ట్‌ఫ్రెండ్ అయిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని శాండల్‌వుడ్‌లో నటీనటులు ఆందోళనకు గురవుతున్నారు. రాహుల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్‌ డేటాను సేక‌రిస్తున్నారు. ఇక ఈ కేసులో సంజ‌న పేరు వినిపిస్తున్నా ఆమెను విచారిస్తే మ‌రికొన్ని విష‌యాలు తెలుస్తాయంటున్నారు. సంజ‌న మాత్రం రాగిణితో త‌న‌కు సంబంధం లేద‌ని.. ఆమెతో క‌లిసి ఓ సినిమాలో మాత్ర‌మే న‌టించాన‌ని చెపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news