Gossipsఅదే జ‌రిగితే ఎన్టీఆర్ క్రేజ్ అందుకోవ‌డం ఏ హీరోకూ సాధ్యం కాదు..!

అదే జ‌రిగితే ఎన్టీఆర్ క్రేజ్ అందుకోవ‌డం ఏ హీరోకూ సాధ్యం కాదు..!

టెంప‌ర్‌తో ఎన్టీఆర్ క్రేజ్ మారిపోయింది. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జన‌తా గ్యారేజ్ – జై ల‌వ‌కుశ – అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ ఇలా ఐదు వ‌రుస హిట్ల‌తో యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. రేపు ఆర్ ఆర్ ఆర్‌తో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నాడు. దీనిని బ‌ట్టి ఇప్పుడు మిగిలిన యంగ్ హీరోల‌తో పోలిస్తే ఎన్టీఆర్ తిరుగులేని స్వింగ్‌లో క‌నిపిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత కూడా ఎన్టీఆర్ న‌టించేవి అన్ని క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి.

9 Interesting Things About Jr NTR That Every Fan of His Must Know -  BookMyShow

ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాలో జాయిన్ అవుతాడు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తీసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ కోస‌మే త్రివిక్ర‌మ్ అన్వేష‌ణ‌లో ఉన్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడు. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఇప్ప‌టికే మైత్రీ మూవీస్ ప్ర‌శాంత్ నీల్‌, ఎన్టీఆర్‌కు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Jr NTR celebrates 37th birthday; RRR director SS Rajamouli, Venkatesh  Daggubati, Rakul Preet wish actor - Entertainment News , Firstpost

ప్ర‌శాంత్ నీల్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాయే. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్‌, త్రివిక్ర‌మ్‌, ప్ర‌శాంత్ నీల్ ఈ మూడు పాన్ ఇండియా సినిమాలే.. ఈ మూడు హిట్ అయితే క‌నుక ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. ఇప్ప‌టికే ఐదు వ‌రుస హిట్ల‌కు తోడు మ‌రో మూడు పాన్ ఇండియా హిట్లు ప‌డితే ఎన్టీఆర్ క్రేజ్‌ను ఏ హీరో కూడా అందుకోలేడ‌న్న‌ది నిజం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news