Moviesబిగ్ అప్‌డేట్‌: డ‌్ర‌గ్స్ ఉచ్చులో నాని హీరోయిన్‌... ఇండ‌స్ట్రీ షేక్‌

బిగ్ అప్‌డేట్‌: డ‌్ర‌గ్స్ ఉచ్చులో నాని హీరోయిన్‌… ఇండ‌స్ట్రీ షేక్‌

డ్ర‌గ్స్ ఉదంతం ముందు నుంచి ఇండ‌స్ట్రీని కుదిపేస్తోంది. హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల పేర్లు ఈ ఇష్యూలో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కేసులో ముందు పోలీసులు, ప్ర‌భుత్వాలు హ‌డావిడి చేయ‌డం ఆ త‌ర్వాత నీరుగారిపోవ‌డం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సినీ పెద్ద‌ల ఒత్తిళ్లు, రాజ‌కీయ నేత‌ల ఒత్తిళ్లు కూడా కార‌ణం. డ్ర‌గ్స్ కేసులో సెల‌బ్రిటీల‌ను అరెస్టు చేసిన వార్త‌లు మాత్రం మ‌నం ఎప్పుడూ చూడం.

Ragini Dwivedi on Sandalwood drug racket: I am committed to appear before  Crime Branch on Monday - Movies News

తాజాగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఓ కుదుపు కుదిపేస్తోంది. క‌న్న‌డ న‌టి రాగిణి ద్వివేదికి సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచార‌ణ‌కు రావాల‌ని ఆ నోటీసుల్లో ఆదేశించారు. జాయింట్ పోలీస్ క‌మిష‌న‌ర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ ఆమెకు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాల‌తో లింకులు ఉన్నాయ‌ని ఆధారాలు ఉండ‌డంతోనే విచార‌ణ‌కు పిలిచామ‌న్నారు.

Is this why Ragini Dwivedi flew to Dubai? | Kannada Movie News - Times of  India

ఇప్ప‌టికే ఈ కేసులో పోలీసులు రాగిణి స్నేహితుడు రవిని సిసిబి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ర‌వి ఇచ్చిన స‌మాచారంతోనే రాగిణికి కూడా డ్ర‌గ్స్ ఇష్యూతో లింకులు ఉన్నాయ‌ని తెలిసింది. ఏదేమైనా రాగిణికి స‌మ‌న్ల జారీతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఇంత‌కు రాగిణి క్రేజీ హాట్ హీరోయిన్. ఆమె తెలుగులో నాని ప‌క్క‌న జెండా పై క‌పిరాజు సినిమాలో న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news