నీ భ‌ర్త ఎంత ద‌రిద్రంగా ఉన్నాడో… స్టార్ హీరోయిన్‌పై దారుణంగా ట్రోలింగ్‌

బాలీవుడ్ వార‌సురాలు, హీరోయిన్ సోన‌మ్‌క‌పూర్‌పై గతంలో అనేకసార్లు ట్రోలింగ్ జ‌రగ‌డం.. ఆమె దానికి ఘాటైన కౌంట‌ర్లు ఇవ్వ‌డం మామూలే. అయితే ఈ సారి నెటిజ‌న్లు సోన‌మ్‌ను కాకుండా ఆమె భ‌ర్తను టార్గెట్ చేయ‌డంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఓ అమెరిక‌న్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ సోన‌మ్‌ను నెపోటిజం ప్రొడ‌క్ట్ అని సెటైర్ వేసింది. అక్క‌డితో ఆగ‌కుండా నీ భ‌ర్త ఏమైనా హాట్‌గా ఉన్నాడ‌ని ఫీల‌వుతున్నావా ? అంత సీన్ లేదు.. నువ్వు క‌ళ్లు తెర‌చి చూస్తే అత‌డు ఎంత ద‌రిద్రంగా ఉన్నాడో అని కామెంట్ చేసింది.

Sonam Kapoor's emotional message for her mom, dad and brother will melt  your heart | Celebrities News – India TV

ఈ కామెంట్ చూసిన సోన‌మ్‌కు కోపం న‌షాళానికి ఎక్కింది. ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేయ‌డంతో పాటు ఈ పోస్టు వ‌ల్ల నీ ఫాలోవ‌ర్లు పెరుగుతారు.. మ‌న‌సులో అంత ద్వేషం మంచిది కాదు…కేవ‌లం స్టార్స్ దృష్టిని ఆక‌ర్షించేందుకే మీరు ఇలా చేస్తుంటార‌ని ఫైర్ అయ్యింది. ఏదేతేనేం నీ కోరిక నెర‌వేర్చాన‌ని కూడా సోనమ్ చెప్పుకొచ్చింది.

Sonam Kapoor, Rhea wish brother Harshvardhan on his birthday with heartfelt  posts. See pics - bollywood - Hindustan Times

ఇక ఈ విష‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు సోన‌మ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇలాంటి చెత్త పోస్టులు మీరు పట్టించుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఇక పెళ్ల‌య్యాక సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సోన‌మ్ ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ఆనంద్‌తో క‌లిసి లండ‌న్‌లో నివ‌సిస్తున్నారు. ఆమె చివ‌రిసారిగా జోయా ఫ్యాక్ట‌ర్ సినిమాలో క‌నిపించారు.

Leave a comment