బిగ్‌బాస్‌లో దేవి వ‌ర్సెస్ రాజ‌శేఖ‌ర్‌.. దేవి డైలాగ్‌తో షాక్ అయిన మాస్ట‌ర్‌

బిగ్‌బాస్ రెండో వారంలో అంతా కామెడీ కామెడీగా సాగుతోంది. ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వ‌డంతో సంద‌డి బాగానే ఉంది. ఇదిలా ఉంటే యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి త‌న‌ను అంద‌రు కావాల‌ని ప‌క్క‌న పెడుతున్నారంటూ వాపోయింది. అలాంటిదేమి లేద‌ని లాస్య చెప్పినా కూడా దేవి మాత్రం క‌న్విన్స్ అవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే దేవి వ‌ర్సెస్ అమ్మ రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య చిన్న గొడ‌వ కూడా జ‌రిగింది.

Devi Nagavalli (Bigg Boss Telugu 4) Wiki, Age, Height, Boyfriend, Family,  Biography & More – WikiBio

ఎవ‌రు ఏ ప‌ని చేయాల‌న్న అంశంపై దేవి వ‌ర్సెస్ అమ్మ రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. గొంతు పెంచి మాట్లాడితే తాను ఒప్పుకోన‌ని దేవి రాజ‌శేఖ‌ర్ మొఖం మీదే తేల్చిచెప్పింది. ఒక్క‌సారిగా షాక్ అయిన మాస్ట‌ర్ నీ వాయిస్ పెరిగితే ఏం లేదు.. నా వాయిస్ పెరిగితే త‌ప్పా అని అని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త ర‌భ‌స జ‌రిగింది.

Bigg Boss Telugu 4 contestant Amma Rajasekhar: From movies to judging dance  reality shows, everything you need to know about the  choreographer-turned-director - Times of India

అంతకు ముందే కెప్టెన్ లాస్య‌కు, దేవికి కూడా చిన్న‌పాటి వాగ్వాదం జ‌రిగింది. నామినేష‌న్ల త‌ర్వాత త‌న‌ను అంద‌రూ కావాల‌నే ఎవాయిడ్ చేస్తున్నారని దేవి ప‌దే ప‌దే లాస్య‌తో వాదించింది. ఆ త‌ర్వాత అవినాష్..‌ మోనాల్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో చేసి చూపించ‌డంతో ఆమె హ‌ర్ట్ అవ్వ‌గా.. ఆమెను క్ష‌మించ‌మ‌ని అవినాష్ కోరాడు.

Leave a comment