Moviesబిగ్‌బాస్ 4: లాస్య‌కు నాగార్జున అదిరే గిఫ్ట్ ఇచ్చాడే.. ఏంటో...

బిగ్‌బాస్ 4: లాస్య‌కు నాగార్జున అదిరే గిఫ్ట్ ఇచ్చాడే.. ఏంటో తెలుసా

బిగ్‌బాస్ హౌస్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా ప్ర‌ముఖ యాంక‌ర్ లాస్య ఎంట్రీ ఇచ్చారు. లాస్య ఎంట్రీ ఇవ్వ‌డంతోనే నాగార్జున ఆమెను పిచ్చ ఆట పట్టించాడు. త‌న బాబు బాధ్య‌త‌న‌ను త‌న భ‌ర్త‌, అత్త‌గారికి అప్ప‌గించి వ‌చ్చాన‌ని లాస్య చెప్పింది. ఇక ఆరేళ్ల క్రితం నాగార్జునను ఆమె ఇంట‌ర్వ్యూ చేసింది.. ఆ విష‌యం గుర్తుంచుకున్న ఆమె సార్ మీరు 20 ఏళ్లు ఎందుకు లేట్‌గా పుట్ట‌లేద‌ని తాను అడిగితే.. అందుకు నాగ్ నువ్వు 20 ఏళ్లు ఎందుకు ముందు పుట్ట‌లేద‌ని అన్న విష‌యం చెప్ప‌గా.. ఆ ఇంట‌ర్వ్యూ త‌న‌కు కూడా గుర్తుంద‌ని నాగ్ చెప్పాడు.

ఇక త‌న బిడ్డ జున్నును గుర్తు చేసేలా నాగ్ ఆమెకు ఓ చిన్న పిల్ల బొమ్మ ఇచ్చాడు. లాస్య త‌న బిడ్డ‌కు దూరంగా ఉండాల్సి రావ‌డంతో నాగ్ ఆమెను మ‌న టీవీలో చూపించాడు. త‌న బిడ్డ జున్నును చూసి లాస్య భావోద్వేగానికి గురైంది. ఇక భ‌ర్త మంజునాథ్ లాస్య‌ను టెన్ష‌న్ ప‌డ‌కుండా ఆడాల‌ని సూచించాడు. ఇక త‌న‌ది క‌డ‌ప అని లాస్య చెప్ప‌గా నాగ్ లాస్యా రెడ్డి అంటూ కాసేపు ఆట ప‌ట్టించాడు. ఇక లాస్య‌కు భ‌ర్త మంజునాథ్ ఐలవ్ యూ సోమ‌చ్ జాగ్ర‌త్త‌గా ఆడ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. ఇక హౌస్‌లోకి లాస్య వెళ్లేముందు నాగ్ లాస్య‌తో చీమ – ఏనుగు జోక్ చెప్పించాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news