Moviesబిగ్‌బాస్ సెకండ్ కంటెస్టెంట్ ఎవ‌రంటే...

బిగ్‌బాస్ సెకండ్ కంటెస్టెంట్ ఎవ‌రంటే…

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4  ప్రారంభ‌మైంది. నాగార్జున వ్యాఖ్య‌త‌గా వ‌చ్చి షోను ద‌ద్ద‌రిల్లేలా చేస్తున్నారు. స్టార్‌ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు నాగ్‌. ఇక హౌస్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉండ‌నున్నారు. కిచెన్‌లో 16 కుర్చీలు ఉన్నాయ‌ని.. హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉంటార‌ని నాగార్జున చెప్పాడు. ఇక తొలి కంటెస్టెంట్‌గా గుజ‌రాతీ బామ హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె సుడిగాడు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా చేసింది. సీజన్‌ 4లో ఉన్న ఒన్‌ అండ్ ఓన్లీ హీరోయిన్‌ మోనల్‌ గజ్జర్‌.

ఇక రెండో కంటెస్టెంట్‌గా హీరోయిన్ క‌ళ్యాణి భ‌ర్త‌, డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ ఎంట్రీ ఇచ్చాడు. అత‌డు సుమంత్ హీరోగా నాగార్జున నిర్మాత‌గా చేసిన స‌త్యం సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఇక హౌస్‌లోకి సూర్య‌కిర‌ణ్ కూడా వెళ్లాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news