Moviesబిగ్‌బాస్ హౌస్‌లో ఎంత‌మందో చెప్పేసిన నాగ్‌.. తొలి కంటెస్టెంట్ ఎవ‌రంటే

బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత‌మందో చెప్పేసిన నాగ్‌.. తొలి కంటెస్టెంట్ ఎవ‌రంటే

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. కొద్ది సేప‌టి క్రిత‌మే నాగార్జున షోను ప్రారంభించారు. ఇప్ప‌టికే హౌస్ ప‌రిచ‌యం కూడా ప్రారంభ‌మైంది. ఇక హౌస్‌ను నాగార్జున తండ్రి సీనియ‌ర్ నాగార్జున ( ద్విపాత్రాభిన‌యం) హౌస్ లోప‌ల‌కు వెళ్లి అన్ని చూపించారు. ఇక ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్లు ఒక్కొక్క‌రు ఎంట్రీ ఇచ్చే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది.

ఈ షో లో మొత్తం 14 మంది పాల్గొంటున్నారు. ఇక గతంలో కంటే కాస్త మెరుగ్గా బిగ్ బాస్ హౌస్ ని తయారు చేసారు. ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ హౌస్‌లోకి రావ‌డం ఆనందంగా ఉంద‌ని.. తాను గుజ‌రాతీని అని చెపుతూ తెలుగులో మొత్తం ఐదు సినిమాలు చేశాన‌ని. చివ‌రి సినిమా బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి అని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news