Moviesబాల‌య్య హీరోయిన్ దేశంలోనే రిచ్చెస్ట్... ఆమె ఆస్తి ఎంతో తెలుసా..

బాల‌య్య హీరోయిన్ దేశంలోనే రిచ్చెస్ట్… ఆమె ఆస్తి ఎంతో తెలుసా..

1985 – 90వ ద‌శ‌కంలో ర‌వీనా టాండ‌న్ పేరు చెపితేనే ప్రేక్ష‌కులు దేశ‌వ్యాప్తంగా ఊగిపోయేవారు. అప్ప‌ట్లో క‌ర్ర‌కారు మ‌దిని దోచిన ఈ హాట్ హీరోయిన్ స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించింది. స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస‌గా సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఆమె స్టైల్‌కు, అందానికి, అభిన‌యానికి వృద్ధులు సైతం ఊగిపోయేవారు. ఆమె తెలుగులోనూ కొన్ని సినిమాల్లో న‌టించింది. యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప‌క్క‌న ఆమె బంగారు బుల్లోడు సినిమాలో న‌టించింది.

ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత కింగ్ నాగార్జున ప‌క్క‌న ఆకాశ‌వీథిలో సినిమా చేసినా కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఆమె చాలా వ‌య‌స్సు వ‌చ్చాక కాని పెళ్లి చేసుకోలేదు. బాలీవుడ్‌లో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ అయిన అనిల్ త‌డానీని ఆమె పెళ్లి చేసుకుంది. నార్త్‌లో ఆయ‌న  ఓ బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్‌. ఆయ‌న కంట్ర‌ల్లో కొన్ని వంద‌ల థియేట‌ర్లు ఉన్నాయి.

ఇక ఆమె భ‌ర్త అనిల్ త‌డానీ కరణ్ జోహార్‌తో కలిసి బాహుబలి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతని నికర ఆస్తుల విలువ 6.5 మిలియన్ డాలర్లు. అనిల్ ను పెళ్లి చేసుకున్న ర‌వీనా ఇప్పుడు దేశంలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ అయ్యింది. ఆమె ఆస్తికి ఎవ్వ‌రూ కూడా సాటి వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news