Moviesత‌మ‌న్నా రేంజ్ ఇంత‌లా ప‌డిపోయిందా.. చివ‌ర‌కు ఆ హీరోతో కూడానా....!

త‌మ‌న్నా రేంజ్ ఇంత‌లా ప‌డిపోయిందా.. చివ‌ర‌కు ఆ హీరోతో కూడానా….!

తెలుగులో ప‌దిహేనే సంవ‌త్స‌రాలుగా ఓ ఊపు ఊపేసింది మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ్‌లోనూ ఒక ద‌శాబ్దం ఆమె ఆడింది ఆట పాడింది పాట అయ్యింది. రెండు భాష‌ల్లో భారీ స్టార్స్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో ఆమె న‌టించింది. అయితే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ కావ‌డంతో త‌మ‌న్నా త‌ళుక్కులు త‌గ్గిపోయాయి. ఇక కొంత కాలంగా చూస్తే ఆమె త‌న రేంజ్‌బాగా త‌గ్గించుకుని క‌ళ్యాణ్‌రామ్‌, సందీప్ కిష‌న్ లాంటి మీడియం రేంజ్‌, బిలో మీడియం రేంజ్ హీరోల‌తో న‌టించింది. అయినా ఆమె ల‌క్ మార‌లేదు.

అయితే ఇప్పుడు అంత‌క‌న్నా త‌క్కువ రేంజ్ హీరో అయిన స‌త్య‌దేవ్ ప‌క్క‌న న‌టించేందుకు రెడీ అయిపోయింది. అస‌లు స‌త్య‌దేవ్ సోలో హీరోగా హిట్టే కొట్ట‌లేదు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీ రిలీజ్‌తో స‌రిపెట్టుకుంది. ఇక తాజాగా స‌త్య‌దేవ్ కన్న‌డ హిట్ మూవీ లవ్ మాక్‌టైల్ రీమేక్‌లో నటించనున్నట్లు కొన్ని రోజుల కిందటే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం టైటిల్‌తో తెర‌కెక్కిస్తున్నారు.

కొత్త ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ నిర్మాత‌గా మారి స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇక క‌న్న‌డ‌లో హిట్ అయిన ఈ రీమేక్ మూవీనే ఇప్పుడు త‌మ‌న్నాకు గ‌తి అయ్యింది. అది కూడా స‌త్య‌దేవ్ హీరోగా.. ఏదేమైనా త‌మ‌న్నా రేంజ్ పూర్తిగా ప‌డిపోయింద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news