Moviesబిగ్‌బాస్ 4కు రఘు మాస్ట‌ర్ బిగ్ షాక్‌.. చివ‌ర్లో హ్యాండ్‌..!

బిగ్‌బాస్ 4కు రఘు మాస్ట‌ర్ బిగ్ షాక్‌.. చివ‌ర్లో హ్యాండ్‌..!

బిగ్‌బాస్ 4 నుంచి బిగ్ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి కొద్ది రోజుల్లో ఈ షో ప్రారంభం అవుతోన్న వేళ ఈ షోకు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ అనేక‌మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డ్యాన్స్ మాస్ట‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ సైతం ఈ షోలో పాల్గొంటున్నాడ‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. ర‌ఘుమాస్ట‌ర్‌తో పాటు ఆయ‌న భార్య ప్ర‌ణ‌వి సైతం ఈ షోలోకి ఎంట్రీ ఇస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్త‌ల‌ను కొట్టిప‌డేస్తూ ర‌ఘు మాస్ట‌ర్ తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ల‌డం లేదంటూ షాక్ ఇచ్చాడు. త‌న‌కు బిగ్‌బాస్ 4కు రావాల్సిందిగా ఆఫ‌ర్ వ‌చ్చిన‌మాట వాస్త‌వ‌మే. కానీ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల షోలో పాల్గొన‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ర‌ఘు మాస్ట‌ర్ మొద‌ట‌ బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని.. చివ‌ర్లో ఎందుకో గాని త‌న డెసిష‌న్ మార్చుకున్నాడ‌ని.. బిగ్‌బాస్‌కు హ్యాండ్ ఇచ్చాడ‌ని అంటున్నారు.

దీంతో ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ర‌ఘు మాస్ట‌ర్ స్తానంలో ఎవ‌రు వెళుతున్నార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. గ‌త యేడాది సీజ‌న్లో డ్యాన్స మాస్ట‌ర్‌గా కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ ఉన్నారు.. మ‌రి ఇప్పుడు హౌస్‌లోకి ఎవ‌రైనా కొరియోగ్రాఫ‌ర్ ఉంటాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news