Moviesచిరు బ‌ర్త్‌డే మెగాడాట‌ర్ సూప‌ర్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చేసింది... ఫ్యాన్స్ ర‌చ్చే

చిరు బ‌ర్త్‌డే మెగాడాట‌ర్ సూప‌ర్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చేసింది… ఫ్యాన్స్ ర‌చ్చే

మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు వినాయ‌క‌చ‌వితి పండ‌గ‌తో పాటు చిరు బ‌ర్త్ డే కూడా జ‌రుపుకుంటున్నారు. ఇక పలువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెపుతున్నారు. ఇక చిరు త‌న‌యురాలు సుస్మిత మెగా అభిమానుల‌కు తండ్రి బ‌ర్త్ డే కానుక‌గా ఓ అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చేశారు. ఇటీవ‌ల ఆమె త‌న భ‌ర్త విష్ణు ప్రసాద్తో కలిసి గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆమె వెబ్ సీరిస్ నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

తాజాగా తండ్రి బ‌ర్త్ కానుక‌గా ఆమె ఈ వెబ్ సీరిస్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. షూటవుట్ ఎట్ ఆలేరు అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్లో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సీరిస్ క్రైం థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కనుంది. క‌థ కూడా రివీల్ చేసేశారు. మెగా ఫ్యామిలీలో అంద‌రూ ఏదో ఒక రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు సుస్మిత కూడా ఇక్క‌డ కూడా రాణిస్తే మెగా ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు.

 

https://www.youtube.com/watch?v=_YCfk05aDWs&feature=emb_logo

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news