Moviesబాల‌య్య‌పై వ‌ర్మ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌... ఈ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు...!

బాల‌య్య‌పై వ‌ర్మ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌… ఈ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను టార్గెట్ చేస్తూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. బాల‌య్య స్వ‌భావం గురించి తెలిసిన వారు మాత్రం ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఏదేమైనా బాల‌య్య డ‌బ్బాలు కొట్టించుకునేందుక మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ప‌బ్లిసిటీకి ఆయ‌న ఆమ‌డ దూరం పాటిస్తారు. ఇక బాల‌య్య‌పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాల‌య్య వ్య‌క్తిత్వాన్ని ఆమె ఆకాశానికి ఎత్తేశారు. వ‌ర్మ థ్రిల్ల‌ర్ మూవీ హీరోయిన్ అప్సరా రాణి ఉరఫ్ అంకితా మాహా రాణా బాల‌య్య గురించి కొన్ని ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చింది. బాల‌య్య చివ‌రి సినిమా రూల‌ర్‌లో న‌టించేందుకు ముందుగా ఆమెను సంప్ర‌దించార‌ట‌. ఈ క్ర‌మంలోనే తాను బాల‌య్య‌ను క‌లిశాన‌ని.. బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న త‌నను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని అంకితా రాణా చెప్పింది. బాల‌య్య పొద్దున్నే వ‌ర్క‌వుట్ చేసే స‌మ‌యంలో తాను ఆయ‌న ఇంటికి వెళ్ల‌డంతో త‌న‌ను వెయిట్ చేయించినందుకు ఆయ‌న సారీ చెప్పార‌ని అంకిత తెలిపింది.

ఇక ఓ స్టార్ హీరో అయ్యి ఉండి కూడా త‌న‌తో పాటు త‌న త‌ల్లితో ఆయ‌న చాలా హుంద‌గా ప్ర‌వ‌ర్తించార‌ని అంకిత చెప్పింది. ఇక తాను న‌టించిన కొన్ని సీన్ల‌ను ట్యాబ్‌లో బాల‌య్య గారికి చూపించి మురిసిపోయాన‌ని.. చివ‌ర‌కు తాము వెళుతుంటే ఆయ‌నే స్వ‌యంగా వ‌చ్చి కారు డోర్ కూడా తీశార‌ని… అప్పుడు త‌న‌కు భ‌యం వేసింద‌ని.. కానీ బ‌య‌ట ఆయ‌న గురించి ఎందుకు నెగిటివ్ వ్యాఖ్య‌లు చేస్తారో కూడా అర్థం కాద‌ని వాపోయింది.

 

https://www.youtube.com/watch?time_continue=31&v=nUc18nasXes&feature=emb_logo

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news