Politicsవైసీపీ ఆఫీస్ ముందు క్షుద్ర‌పూజ‌లు.. పార్టీలో క‌ల‌క‌లం..!

వైసీపీ ఆఫీస్ ముందు క్షుద్ర‌పూజ‌లు.. పార్టీలో క‌ల‌క‌లం..!

చిత్తూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేగింది జిల్లాలోని కుప్పంలో గల వైసీపీ కార్యాలయం ముందు క్షుద్రపూజల చేసినట్లు ఆనవాళ్లు క‌నిపించ‌డంతో పార్టీ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. కుప్పం బైపాస్ రోడ్డులో గ‌ల పార్టీ ఆఫీస్ గేటు ముందు ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క్షుద్ర‌పూజ‌లు చేసిన‌ట్టు అక్క‌డ ఆ ఆన‌వాళ్లు ఉన్నాయి. ప‌సుపు, కుంకుమ‌, టెంకాయ‌, నిమ్మ‌కాయ‌ల‌తో పూజులు చేసిన‌ట్టుగా ఉంది. ఈ విష‌యం ఇప్పుడు కుప్పం వైసీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

Occult worship in front of the Kuppam YCP office

దీనిపై పోలీసులు సైతం విచార‌ణ చేస్తున్నారు. ఇవి క్షుద్ర‌పూజ‌లేనా అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. వైసీపీ నేత‌లు ఎవ‌రో కొంద‌రు త‌మ‌పై నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తుంటే.. కొంద‌రు మాత్రం కుప్పం వైసీపీలో గ్రూపు రాజ‌కీయాలు రాజ్యం ఏలుతుండ‌డంతో ఇక్క‌డ ఎవ‌రిని అనుమానించాలో తెలియ‌డం లేద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news