Moviesస్వీటీ ఫ్యాన్స్ పండ‌గ చేస్కొనే న్యూస్‌... వ‌చ్చే వార‌మే ప్ర‌క‌ట‌న‌..!

స్వీటీ ఫ్యాన్స్ పండ‌గ చేస్కొనే న్యూస్‌… వ‌చ్చే వార‌మే ప్ర‌క‌ట‌న‌..!

ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో సినిమా ఇండ‌స్ట్రీలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాక నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వ‌గా.. ఇప్పుడు నాని వి సినిమా సైతం వ‌చ్చే నెల 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పుడు అనుష్క నిశ్శ‌బ్దం సినిమా సైతం ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ కరోనా వల్ల ఈ చిత్రం విడుదల ఆగిపోవాల్సి వచ్చింది.

Anushka's multi-lingual 'Nishabdham' postponed to Summer -

ఇక మన దగ్గర కూడా డిజిటల్ రిలీజ్ పర్వం మొదలు కావడంతో నిశ్శబ్దం కూడా ఈ ఓటీటీలోనే వ‌స్తుంద‌ని ర‌చ‌యిత కోన వెంక‌ట్ హింట్ ఇచ్చాడు. అయితే అప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఈ సినిమా రిలీజ్‌పై ఏ వార్త కూడా రాలేదు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా ఓటీటీలోనే రానుంద‌ని తెలుస్తోంది. దీనిపై మేక‌ర్స్ ఓ క్లారిటీకి వ‌చ్చేశార‌ట‌. ఈ ఓటీటీ రిలీజ్‌పై వచ్చే వారంలో ప్ర‌క‌ట‌న రానుందని తెలుస్తోంది. ఏదేమైనా గ‌త కొద్ది నెల‌లుగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న నిశ్శ‌బ్దం రిలీప్‌పై మొత్తానికి క్లారిటీ రావ‌డంతో స్విటీ అనుష్క ఫ్యాన్స్ ఇక పండ‌గ చేస్కోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news