తారక్ మొదలెట్టాడు.. త్రివిక్రమ్ ఆగనంటున్నాడు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ తాజాగా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గతంలో అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు తారక్.

దీంతో త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయాలని తారక్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. కాగా తాజాగా తన 30వ చిత్రాన్ని తారక్ డైరెక్షన్‌లో చేయనున్నట్లు రివీల్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే నుండి మొదలుపెట్టనున్నారు. కాగా సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ముగియగానే ఈ సినిమాను మొదలుపెడతారట చిత్ర యూనిట్.

ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ రాధాకృష్ణ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి తారక్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ను తారక్ అందించడంతో వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Leave a comment