బాలయ్యకు వెంటనే కావాలట.. ఏమిటో తెలుసా?

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘రూలర్’ భారి అంచనాలతో రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హా నుండి కేథరిన్ వరకు ఆమె కాదు ఈమె, ఈమె కాదు ఆమె అని అనేక పేర్లు వినిపిస్తున్నాయి. చిన్న హీరోల సినిమాల్లో సెకెండ్ లీడ్ క్యారెక్టర్లు చేసే కేథరిన్ లాంటి హీరోయిన్ కూడా బాలయ్య వంటి సీనియర్ స్టార్ హీరో పక్కన నటించడానికి ఆసక్తి చూపించట్లేదు. కాగా సినిమా వచ్చే వారం నుండి సెట్స్ మీదకు రానుంది. ఇప్పుడు బాలయ్యకు అర్జెంట్‌గా ఒక హీరోయిన్ కావాలి. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా, లెజెండ్’ సినిమాలు బాక్సాఫిస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకున్నాయి.

ఈ సినిమా కూడా హిట్ అయితే వీళ్లు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరగా కనిపించబోతున్నాడట. దాని కోసమే బాలయ్య గుండుతో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Leave a comment