Gossipsరానా కి కిడ్నీ దానం చేసిన తల్లి..!

రానా కి కిడ్నీ దానం చేసిన తల్లి..!

ప్రముఖ నిర్మాత డి రామానాయుడు మనవడు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. సినీ పరిశ్రమలో కేవలం హీరోగానే కొనసాగాలని పట్టుపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా తనకు ఏ పాత్ర వచ్చినా దానికి న్యాయం చేయాలనే పంధాలో సాగుతున్నాడు రానా.

ఈ నేపథ్యంలో తెలుగు,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో రానా నటిస్తున్నారు. ఆ మద్య బాహుబలి మూవీలో భళ్లాలదేవుడిగా ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అయితే రానాకు కిడ్నీ సమస్య రావడంతో కొంత కాలం హైదరాబాద్, ముంబైల్లో కిడ్నీ సమస్యకు చికిత్స పొందారు.

అయితే, ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించక పోవడంతో, అమెరికాలో చికిత్స పొందాలని భావించారు. ఈ నేపథ్యంలో రానాకు తప్పని సరి కిడ్నీ మార్చాలిన అవసరం ఉందని వైద్యులు తెలిపారట. కిడ్నీ మార్చకుంటే లాభంలేదని తేల్చడంతో కన్న బిడ్డ క్షేమం కోసం రానా తల్లి లక్ష్మి తన కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించారు.

దీంతో చికాగో వైద్యులు నెల రోజుల పాటు రానాను అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్సలు చేస్తూ కిడ్నీని సక్సెస్ ఫుల్ గా మార్చారు. ప్రస్తుతం రానా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. తదుపరి ఆయన ‘విరాట పర్వం’ మూవీలో నటించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news