Movies' ఇస్మార్ట్ శంక‌ర్ ' 6 రోజులు కలెక్షన్స్ ... దుమ్ముదులిపేస్తున్న...

‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ 6 రోజులు కలెక్షన్స్ … దుమ్ముదులిపేస్తున్న ఇస్మార్ట్..

ఇస్మార్ట్ శంకర్ విజ‌యంతో ఆ సినిమా మేక‌ర్స్ మామూలుగా సంబ‌రాలు చేసుకోవ‌డం లేదు. నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరి, హీరో రామ్ లు చాలా ఖుషీగా ఉన్నారు. ఈ ముగ్గురికి చాలా రోజుల త‌ర్వాత శంక‌ర్ రూపంలో మాంచి హిట్ ప‌డింది. ఇక ఈ సినిమా రామ్ కెరీర్ లో కలెక్షన్స్ పరంగా అల్ టైం హిట్ మూవీగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది.

తాజాగా ఈ సినిమా 6 రోజుల వ‌సూళ్ల‌పై నిర్మాత ఛార్మి కొద్దిసేపటి క్రితం ఈ మూవీ వసూళ్ల కు సంబంధించి ఓ పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాని ప్రకారం ఇస్మార్ట్ శంకర్ ఆరు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని తెలుస్తుంది. ఇండియ‌న్ మూవీస్‌కు క‌ల్ప‌వృక్షం అయిన ఓవ‌ర్సీస్‌లో వ‌సూళ్లు డ‌ల్‌గా ఉన్నా… రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇస్మార్ట్ శంకర్ దుమ్ము రేపుతోంది.

ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ దాటేసి భారీ లాభాల్లో ఉన్న ఈ సినిమా రూ.40 కోట్ల పై చిలుకు షేర్ మార్క్‌ను సులువుగా క్రాస్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” విడుదల వరకు ఈ చిత్రానికి పోటీ లేకపోవడంతో మ‌రో రెండు రోజుల పాటు ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్‌ను దున్నేయ‌నుంది. ఇక బీ, సీ సెంట‌ర్లలో డియ‌ర్ కామ్రేడ్ క‌న్నా ఇస్మార్ట్ శంక‌ర్‌నే కంటిన్యూ చేసేందుకు బ‌య్య‌ర్లు ఇష్ట‌ప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news