Gossipsఅన్నే కాదు తమ్ముడు తోపే.. దేవరకొండ బ్రదర్స్ మార్క్ మాటల తూటాలు..!

అన్నే కాదు తమ్ముడు తోపే.. దేవరకొండ బ్రదర్స్ మార్క్ మాటల తూటాలు..!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఎనర్జిటిక్ స్టార్. పెళ్లిచూపులు సినిమాతో సోలో హీరోగా హిట్ కొట్టి ఆ తర్వాత అర్జున్ రెడ్డి అంటూ స్టార్స్ నే సర్ ప్రైజ్ చేసిన విజయ్ ఆ తర్వాత గీతా గోవిందంతో స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అతని తమ్ముడు ఆనంద్ హీరోగా వస్తున్నాడు. కె.వి.ఆర్ మహేంద్ర డైరక్షన్ లో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తున్న సినిమా దొరసాని.

జూలై 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ స్పీచ్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. యూఎస్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నా.. అన్న మొదటి సోలో సినిమా పెళ్లిచూపులు ట్రైలర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నా. ల్యాప్ టాప్ లో అన్న మాట్లాడిన మాటలు చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. అక్కడ తెలుగు వాళ్లు ఎవరు లేకపోవడంతో ఒక్కడినే రూం లో కూర్చుని ఏడ్చేశా అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ తమ్ముడు కాబట్టి ఇదంతా జరుగలేదని ఈ సినిమా అలా సెట్ అయిపోయిందని. పెళ్లిచూపులు నిర్మాతలు సురేష్ బాబు, మధురా శ్రీధర్, బిగ్ బెన్ వారు మళ్లీ ఈ సినిమా నిర్మించడం ఆనందంగా ఉందని అన్నాడు ఆనంద్ దేవరకొండ. మైక్ పట్టుకుంటే విజయ్ మాత్రమే అదరగొడతాడని అనుకుంటే తమ్ముడు కూడా తోపులానే మాట్లాడాడని రౌడీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ రౌడీ తమ్ముడి సిని ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news