Gossipsవారంతా నా నడుముపై అలా.. అందుకే ఈ గతి!

వారంతా నా నడుముపై అలా.. అందుకే ఈ గతి!

ఒకప్పుడు తన హాట్ హాట్ అందాలతో బాలీవుడ్ జనాలను పిచ్చోళ్లను చేసిన బ్యూటీ మల్లికా షెరావత్, క్రమంగా సినిమా అవకాశాలు తగ్గడంతో ఫేడవుట్ అయిపోయింది. అయితే ఆమె ఫేడవుట్ కావడానికి గల కారణాలను ఇటీవల ఓ టీవీషోలో బట్టబయలు చేసింది ఈ బ్యూటీ.

మర్డర్, రాజ్ వంటి సినిమాల్లో నటించిన మల్లికా తన అందాలతో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోయింది. ఆ సమయంలో ఆమెను చాలా మంది హీరోలు వాడుకోవాలని చూశారని తెగేసి చెప్పింది ఈ బ్యూటీ. కాగా చిత్ర నిర్మాతలు కూడా తన అందాలకు బానిసలయ్యే వారని.. తన నడుమును ఎలాగైనా వాడుకోవాలని చూశారని చెప్పింది. ఒక సమయంలో తాను నటించే చిత్ర నిర్మాతలు తన నడుముపై ఎగ్ ఫ్రై చేయమని అన్నారట. అంటే తన నడుము అంత హాట్‌గా ఉందని వారి ఉద్దేశ్యమని ఆమె వివరించింది.

ఇక బాలీవుడ్ హీరోలు తమతో పడుకోవాలని వారు డిమాండ్ చేశారని.. కాదన్నందుకే తనకు అవకాశాలు రాకుండా చేసి.. వారి గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఇప్పించారని ఆమె ఆరోపించింది. ఇప్పుడు మల్లికా షెరావత్ చేసిన కామెంట్స్, బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. మరి ఆమె కామెంట్స్‌పై బాలీవుడ్ జనాలు ఏం అంటారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news