డార్లింగ్‌తో మసాలా కలుపుతున్న బ్యూటీ

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆపై రామ్ చరణ్‌తో కలిసి ‘వినయ వధేయ రామ’ అనే జండుబామ్ సినిమాలో నటించింది. ఈ సినిమా దెబ్బతో మళ్లీ టాలీవుడ్‌లో నటించేందుకు జడుసుకున్న ఈ పాపతో మసాలా కలిపేందుకు టాలీవుడ్ డార్లింగ్ రెడీ అవుతున్నాడు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో ప్రభాస్‌‌తో కలిసి ఓ మాస్ మసాలా సాంగ్‌లో నటించేందుకు కియారా అద్వానీని చిత్ర యూనిట్ కలిసిందట. ఆమె ఈ ఆఫర్‌కు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యిందట. ఒకవేళ ఆమె ఈ పాటను ఓకే చేస్తే.. ప్రభాస్‌తో కలిసి ప్రెస్టీజియస్ సాహో చిత్రంలో భాగం కావడం ఖాయమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

అయితే ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశాన్ని ఈ పాప వాడుకుంటుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా అందరూ ఇష్టపడే డార్లింగ్‌తో మసాలా కలిపేందుకు కియారా ఒప్పుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Leave a comment