Gossipsమ‌హేష్‌తో వార్‌కు మెగా హీరో సై..

మ‌హేష్‌తో వార్‌కు మెగా హీరో సై..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా హిట్ ఎంజాయ్ చేస్తున్నాడు. మహర్షి హిట్ తర్వాత ఫ్యామిలీతో స‌హా ఫారిన్ టూర్‌ ఎంజాయ్ చేసి వచ్చిన మహేష్ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు క‌లిసి నిర్మించే ఈ సినిమాను ఏకధాటిగా జరిగే షెడ్యూల్లో ఫినిష్‌ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఈ సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో టాలీవుడ్ హిస్ట‌రీలోనే బ్లాక్ బస్టర్ సినిమా తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మెగా హీరో సినిమా కూడా వచ్చే సంక్రాంతికి బరిలో నిలవ బోతోంది. బ‌న్నీ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమాపై కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో విడుదలయితే దేనికి అడ్వాంటేజ్‌ వుంటుందనేది పూర్తిగా సినిమాకు వ‌చ్చిన టాక్‌ను బ‌ట్టే ఉంటుంది. మ‌హేష్‌ది మాస్‌, కామోడీ టైప్ సినిమా అయితే బ‌న్నీది ఫ్యామిలీ డ్రామా.

ఈ రెండు పెద్ద సినిమాల‌తో వ‌చ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ అదిరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఈ రెండిట్లో ఏది పైచేయి సాధిస్తుందో ? చూడాలి. ఇక సంక్రాంతికే అంటోన్న బాల‌య్య – కేఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమా ఈ రెండు సినిమాల మ‌ధ్య‌లో వ‌స్తే న‌లిగిపోవ‌డం ఖాయం. మ‌రి బాల‌య్య రిస్క్ చేస్తాడా ? లేదా ? వెన‌క్కు త‌గ్గుతాడా ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news