Gossipsఅనుష్కకు ఆ కోరిక తీర్చేదెవరు..!

అనుష్కకు ఆ కోరిక తీర్చేదెవరు..!

స్వీటీ అనుష్కకు ఓ క్రేజీ కోరిక ఉందట. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుష్క కేవలం కమర్షియల్ సినిమాలతోనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పర్ఫెక్ట్ అనిపించుకుంది. అరుంధతి నుండి భాగమతి వరకు అనుష్క సినిమాల హవా తెలిసిందే. భాగమతి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం సైలెన్స్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో మాధవన్ హీరోగా చేస్తున్నాడు.

ఈ సినిమా తెలుగు, తమిళ, హిందిలోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారట. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న అనుష్కకు హాలీవుడ్ సినిమాల్లో నటించాలన్న కోరిక ఉందట. ఆ ఛాన్స్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తుందట అమ్మడు. సైలెన్స్ సినిమాతో హాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నా డైరెక్ట్ హాలీవుడ్ సినిమా చేయాలని ఉందని అంటుందు అనుష్క. ఆమె చేస్తా అనేలా కాని హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఛాన్స్ ఇవ్వరా చెప్పండి.

సైలెన్స్ సినిమాతో పాటుగా సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా నటిస్తున్న అనుష్క ఆ సినిమా టైంలో ఆమెకు గాయాలైనట్టు వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది. ప్రియాంకా, దీపికా పదుకునే ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు చేయగా లేటెస్ట్ గా శృతి హాసన్ కు హాలీవుడ్ వెబ్ సీరీస్ లో ఛాన్స్ వచ్చినట్టు తెలిసిందే. మరి అనుష్కకి హాలీవుడ్ ఛాన్స్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news