Gossipsబిగ్ బాస్-2 కి రి-ఎంట్రీ ఇస్తున్న శివ బాలాజీ

బిగ్ బాస్-2 కి రి-ఎంట్రీ ఇస్తున్న శివ బాలాజీ

బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజి ప్రస్తుతం నడుస్తున్న సెకండ్ సీజన్ లోకి అడుగు పెడుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ హిట్ చేసేందుకు నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. కొద్దిరోజులతో పోల్చుకుంటే గత వారం బెటర్ అని చెప్పొచ్చు.

యాంకర్ ప్రదీప్ ఎంట్రీ బిగ్ బాస్-2 కొత్త ఉత్సాహం తెచ్చింది. ఇక పూజా వైల్డ్ కార్డ్ కూడా అలరించింది. ఇక ఇప్పుడు మరో క్రేజీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. అదెవరో కాదు బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివ బాలాజి అని తెలుస్తుంది. బిగ్ బాస్ విన్నర్ అయిన బాలాజి మళ్లీ బిగ్ బాస్ కు వస్తాడా అంటే ఏమో చెప్పలేం బిగ్ బాస్ పై ఆసక్తి కలిగించేలా వచ్చినా రావొచ్చని అంటున్నారు.

ఒకవేళ శివ బాలాజి వచ్చినా గెస్ట్ గా వచ్చి వెళ్తాడా లేక మళ్లీ కంటెస్టంట్ గా వస్తాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. శివ బాలాజి బిగ్ బాస్ లోకి వచ్చేది లేనిది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news