Newsసైరాకు వాయించేది అతనే.. ఎవరు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు..!

సైరాకు వాయించేది అతనే.. ఎవరు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు..!

ఖైది నంబర్ 150 తర్వాత 151వ సినిమా సైరా నర సింహారెడ్డి సినిమా షురూ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అకడెమీ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ ను ముందు సెలెక్ట్ చేసినా ఆ తర్వాత ఎందుకో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

అయితే ఇళయరాజా, కీరవాణి, థమన్ ఇలా చాలామంది పేర్లు వినపడినా వారెవరిని కాదని ఫైనల్ గా బాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరక్టర్ అమిత్ త్రివేదిని ఎంపిక్స్ చేశారు సైరా యూనిట్. దేవి డి, క్వీన్, ఉండ్తా పంజాబ్, డియర్ జిందగి సినిమాలకు మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేది సైరా సినిమాకు ఫైనల్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ అయ్యాడు.

ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మరో షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దాదాపు రెండువదల ఏళ్ల క్రితం జరిగిన కథతో వస్తున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ రచనా సహకారం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news