Gossipsఅమ్మో సునీతా అలా అనేసిందేంటి ..? 

అమ్మో సునీతా అలా అనేసిందేంటి ..? 

ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్లకుండా  సైలెంట్ గా తన పని తానూ చేసుకుపోయే సింగర్ సునీత ఒక్కసారిగా ఊహించేంచని షాక్ ఇచ్చి అబ్బో చాలా ఉందే మేటర్ అని అనిపించుకుంటోంది. ఈమె తాజాగా సోషల్  మీడియా లో పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ఏంటి.. సింగర్ సునీత నిజంగా అంత మాట అందా? అంటూ ఇప్పుదు అందరు ఆశ్చర్యపోతున్నారు.
కేసీఆర్ మీద ఎవరూ కామెంట్ చేసే ధైర్యం చెయ్యరు అటువంటిది ఎంతో  కూల్ గా ఉండే ఈ స్వీట్ సింగర్ తన పోస్ట్ తో కేసీఆర్ మీదే పంచ్ వేసేసింది. దీంతో అందరూ ఒక్క సారిగా షాక్ అవ్వడమే కాకుండా ఎంత ధైర్యం ఈమెకు అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇంతకీ సింగర్ సునీత పోస్ట్ చేసిన షాకింగ్ పోస్ట్ ఏందంటే.. హైదరాబాద్ రోడ్ల గురించి ఏ ప్రముఖుడూ టచ్ చేయని రీతిలో టచ్ చేసేశారు. ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం – ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేశారు.
DPd53PFVoAA7o6F
 ఇవాంక పర్యటించే ప్రాంతాలన్నీ కొత్తగా అసలు ఆ రోడ్లు ఉన్నది హైదరాబాద్ లోనేనా అన్నట్లుగా తళతళ మెరవటం.. రోడ్డు మధ్యలో పూల మొక్కలు.. పెయింటింగ్స్ తో అదరగొట్టేస్తున్న వేళ.. సునీత చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news